Rashmika Mandanna: రష్మిక మందన్న పుట్టినరోజు నేడు.. ఆమె గురించి తెలియని కొన్ని నిజాలు మీ కోసం

|

Apr 05, 2023 | 7:59 AM

నేషనల్ క్రష్ రష్మిక మందన కన్నడ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించు కొని ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

1 / 10

2 / 10
1996 ఏప్రిల్ 6న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌‌లో జన్మించిన రష్మిక మందన్న. తల్లి తండ్రులు సుమన్, మదన్ మందన్న .. వీళ్లది కొడవ స్వీకింగ్ ఫ్యామిలీ. రష్మిక విద్యాభ్యాసం మొత్తం కొడుగు జిల్లాలో జరిగింది. ఎం.ఎస్,రామయ్య కాలేజీలో జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.

3 / 10
సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు 2012లో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆప్ం ఇండియా’ టైటిల్ సొంతం చేసుకుంది.

4 / 10
దాంతో  పలువురు దర్శక నిర్మాతల దృష్టిలో పడి..  2016లో కన్నడ సినిమా ‘కిర్రీక్ పార్టీ’ సినిమాతో తెరంగేట్రం చేసింది.

5 / 10
వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరో గా రూపొందిన ఛలో అనే పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది

6 / 10
ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విపరీతంగా పెరిగి పోయింది . ఆ తర్వాత అనేక సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది

7 / 10
సౌత్ సినిమాలతో ఫిల్మ్ ఇండిస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన నార్త్‌లో కూడా బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. కెరియర్ మొదట్లో చిన్న హీరోలతో యాక్ట్ చేసిన రష్మిక మందన పుష్ప,గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్‌గా యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది.

8 / 10
ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకున్నప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రం రష్మిక నటించ లేదు.

9 / 10
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక లేడీ ఓరియంటెడ్ మూవీ కి ఓకే చేసింది. తాజాగా ఆ మూవీ కి సంబంధించిన టైటిల్ కూడా విడుదల అయింది. రష్మిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ మూవీ కి రెయిన్ బో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

10 / 10
ఈ మూవీ కి శాంతరుబన్ దర్శకత్వం వహించనుండగా.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ వారు ఈ మూవీ ని నిర్మించబోతున్నారు. రష్మిక నటిస్తున్న మొట్ట మొదటి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.