Rajeev Rayala |
Mar 07, 2024 | 3:05 PM
ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడి నటనకు మంచి పేరొచ్చింది.
ఆతర్వాత హిట్ 2 సినిమాలో నటించింది ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మీనాక్షి కనిపించింది కొద్దిసేపే అయినా తన నటనతో కట్టిపడేసింది .
ప్రస్తుతం ఈ అమ్మడికి చేతినిండా సినిమాలు ఉన్నాయ్. వరుణ్ తేజ్ తో మట్కా.. అలాగే సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తుంది మీనాక్షి చౌదరి. అలాగే తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆ బ్యూటీ ఆఫర్స్ అందుకుందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి చాలా యాక్టివ్ హా ఉంటుంది. క్రేజీ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.