
సినీతారలు తమ లైఫ్ స్టైల్, పాత జ్ఞాపకాలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకుంటారు. ఇప్పుడు సౌత్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా హృదయాలను దోచుకుంటోంది. అది మరెవరో కాదు శోభన.

ఈ ఫోటోను శోభన అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. దక్షిణాది సినిమా చరిత్రలో అందరికంటే ఇష్టమైన తార. ఎనభైలు, తొంభైలలో అనేక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, రజినీకాంత్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న శోభన.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చిన శోభన.. అటు తన డ్యాన్స్ క్లాసులపై శ్రద్ధ వహిస్తుంది. చాలా కాలంగా ఆమె సొంతంగా శాస్త్రీయ నృత్య శిక్షణ శిభిరాన్ని స్టార్ట్ చేసి..చాలా మంది చిన్నారులకు నాట్యం నేర్పిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సైతం పంచుకుంటుంది.

అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన డ్యాన్స్ స్కూల్ ఫోటోస్, వీడియోస్ పంచుకుంటుంది. తాజాగా శోభనకు సంబంధించిన త్రోబ్యాక్ పిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.