
సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా. ? తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడుకు సోషల్ మీడియా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆమె ఎవరంటే.

ఆ ఉంగరాల జుట్టు అమ్మాయి ఎవరో కాదండి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ధనుష్ హీరోగా నటించిన తమిళ్ చిత్రం కోడి సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. అంతకు ముందు మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాలో టీనేజ్ అమ్మాయిగా కనిపించింది.

ప్రేమమ్ సినిమాతో రాత్రికి రాత్రే సెన్సేషన్ అయ్యింది. ఆ తర్వాత 2017లో టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న అనుపమకు ఆఫర్స్ క్యూ కట్టాయి.

తెలుగులో చాలా కాలంపాటు ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించిన ఈ బ్యూటీ.. సిద్ధు జొన్నలగడ్డ జోడిగా టిల్లు స్క్వేర్ సినిమాతో అభిమానులకు ఊహించని షాకిచ్చింది. ఇందులో గ్లామర్ లుక్స్ లో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి కనిపించింది.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అందాల అరాచకం సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను మతిపోగొట్టేస్తుంది. తాజాగా అనుపమ షేర్ చేసిన మోడ్రన్ లుక్ ఫోటోస్ వైరలవుతున్నాయి.