
దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అద్భుతమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

2015లో అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం "ప్రేమమ్" సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే యాక్టింగ్...ఉంగరాల జుట్టుతో అందరి దృష్టిని కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో త్రివిక్రమ్ తెరకెక్కించి అఆ సినిమాలో నటిచింది.

అఆ సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో అరంగేట్రం చేసిన అనుపమ.. శతమానం భవతి మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ కూడా పెరిగింది.

తెలుగు, మలయాళం, తమిళం వంటి పలు భాషా చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తమిళంలో తొలిప్ పోకడే, సైరన్ చిత్రాల్లో నటించింది. ఇన్నాళ్లు ట్రెడిషనల్ లుక్కులో కట్టిపడేసిన అనుపమ.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచింది.

టిల్లు స్క్వేర్ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ మారిపోయింది. ఇందులో గ్లామర్ డోస్ పెంచి ఫ్యాన్స్ కు షాకిచ్చింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అటు మోడ్రన్.. ఇటు ట్రెడిషన్ లుక్కులో కట్టిపడేస్తోంది.