
గతంలో కేవలం బాలీవుడ్ లేదా హాలీవుడ్ ప్రముఖులు మాత్రమే తమ అనారోగ్య సమస్యల గురించి ధైర్యంగా మాట్లాడేవారు. అయితే గత కొద్ది కాలంగా టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా తమ అనారోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. అలా 2022 సంవత్సరంలో కూడా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు తమ తమ వ్యాధుల గురించి మాట్లాడారు.

ఈ ఏడాది అక్టోబర్‌లో సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు తాను మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఇది కండరాల బలహీనతకు సంబంధించిన అరుదైన వ్యాధి.

ప్రముఖ హాలీవుడ్ నటి సెలీనా గోమెజ్ తన డాక్యుమెంటరీలో తన మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా నోరు విప్పింది. మానసిక సమస్యలతో పోరాడి గెలిచిన వారిలో సెలీనా గోమెజ్ ఒకరు.

దంగల్' సినిమాతో వెలుగులోకి వచ్చిన ఫాతిమా సనా షేక్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరినీ షాకింగ్‌కు గురిచేసింది. మెడిసిన్, వ్యాయామాల ద్వారా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫాతిమా తెలిపింది.

ప్రముఖ బాలీవుడ్ నటి యామీ గౌతమ్ కెరటోసిస్ పిలారిస్ అనే అరుదైన చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన అనారోగ్య సమస్యల గురించి చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అతను స్టిబ్యులర్ హైపోఫంక్షన్‌తో బాధపడుతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. అలాగే జాతిరత్నాలు డైరెక్టర్‌అనుదీప్ కూడా హైలీ సెన్సీటీవ్ పర్సన్ (హెచ్‌ఎస్‌పీ) అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపాడు