Kriti Shetty: ఎట్టకేలకు మరో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ.. ఆ స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో కృతి..
'ఉప్పెన'లా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకువచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో కృతి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హిట్స్ అందుకున్న బేబమ్మ.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ ఖాతాలో వేసుకుంది.