సంక్రాంతి సందడి ముగియటంతో కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్ కం పలికేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో నాగచైతన్య. తండేల్ సినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు చైతూ. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వాలెంటైన్స్ వీక్ మీద మాత్రం చాలా మంది హీరోలు ఆశలు పెట్టుకున్నారు. కిరణ్ అబ్బవరం దిల్‌రుబా, విశ్వక్‌సేన్ లైలా, బ్రహ్మా ఆనందం సినిమాలు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు డేట్స్ లాక్ చేశాయి.
ఈ మధ్యే ప్రమోషన్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ కూడా ఫిబ్రవరిలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న మజాకా సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ కానుంది. ఆ తరువాత వీక్‌లో రామమ్ రాఘవం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మార్చి క్యాలెండర్‌ను అయితే పూర్తిగా పక్కన పెట్టేశారు టాలీవుడ్ మేకర్స్. మొదటి మూడు వారాల్లో ఒక్క తెలుగు సినిమా కూడా ఆడియన్స్ ముందుకు రావట్లేదు. మార్చి 28న హరి హర వీరమల్లు రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా... ఇండస్ట్రీ జనాల్లో మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి.
అదే డేట్‌కు యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్, ఆ తరువాత రోజు సూపర్ హిట్ సీక్వెల్స్ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇలా రెండు నెలల పాటు వెండితెర మీద కుర్ర హీరోల జోరే కనిపించనుంది.