
విన్నారుగా అదీ సంగతి... అప్‌డేట్లు కావాలంట.. అప్‌డేట్లు.. అంటూ రాజమౌళి కర్ర పుచ్చుకున్న తీరు చూశారు కదా... ఆయన సరదాకే అన్నప్పటికీ, మహేష్ అభిమానులు మాత్రం కాస్త సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఇంతకీ మా హీరో సినిమా ఎప్పుడుంటుందో చిన్న హింట్ ఇవ్వండి అంటూ బతిమలాడటం ఒక్కటే తక్కువ.

ఇటు పవన్ ఫ్యాన్స్ పరిస్థితి కూడా అంతకు మారుగా ఏం లేదు. మేకర్స్ ఆల్రెడీ ఇచ్చిన అనౌన్స్ మెంట్ ప్రకారమే అయితే, ఇప్పటికే మేకప్ వేసుకోవాలి పవర్‌స్టార్. కానీ ఆయన ఏపీ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా వరదలు, వాటి సమీక్షలు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆ ప్రభావం ఇక్కడ షూటింగుల మీద పడుతోంది. సో... పవర్‌స్టార్ సెట్స్ కి ఎప్పుడొస్తారన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు

పవర్ స్టార్ కోసం ఒకటికి మూడు సినిమాలు ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది ఎలాగైనా మా సినిమా విడుదలైతే బావుంటుందన్నది హరిహరవీరమల్లు మేకర్స్ మనసులో మాట. ఓటీటీ పరంగానూ వెసులుబాటు ఉంటుందన్నది వాళ్ల తొందరకి కారణం. ఓజీ చూద్దురుగానీ, బావుంటుంది అని పవన్ ఆల్రెడీ ఫ్యాన్స్ తో అనేశారు. ఉస్తాద్ భగత్‌సింగ్‌ని హిట్ చేసి, కెరీర్‌ని గాడిలో పెట్టుకోవాలన్నది హరీష్ శంకర్ టార్గెట్. సో.. మూడు యూనిట్లు వెయిటింగ్ పవర్‌స్టార్ కోసం.

రిలీజ్ డేట్ కూడా లాక్ అవ్వటంతో గేమ్ చేంజర్ సినిమాకు సంబందించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

అక్టోబర్ నుంచి ఉండొచ్చన్నది లేటెస్ట్ మాట. సో.. మహేష్, పవన్‌తో పోలిస్తే రామ్‌చరణ్ సినిమానే ముందు సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో బుచ్చిబాబు సినిమా రంగస్థలాన్ని మించేలా ఉంటుందనే టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.