
గుంటూరు కారం సినిమా తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న త్రివిక్రమ్, అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో ఆ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ బన్నీ సడన్‌గా లైనప్ మార్చేయటంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కెళ్లింది.

బన్నీ ప్రాజెక్ట్ డిలే కావటంతో త్రివిక్రమ్ నెక్ట్స్ మూవీ హీరోగా చాలా మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే అలాంటిదేం లేదంటోంది గురూజీ టీమ్.సిద్ధూ జొన్నలగడ్డ, రామ్ లాంటి యంగ్ హీరోలతో త్రివిక్రమ్ మూవీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తల్లోనూ నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

గురూజీ నెక్ట్స్ సినిమా పక్కా పాన్ ఇండియా మూవీనే, అది కూడా టాప్ స్టార్‌తోనే ఉండబోతుందని కన్ఫార్మ్ చేశారు. ప్రజెంట్ బన్నీ సినిమాతో పాటు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు గురూజీ.

ఇద్దరు హీరోల్లో ఎవరు ముందు ఫ్రీ అయితే వాళ్లతో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారు. అయితే ఆ సినిమా ఎవరితో అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.