
మన ఆడియన్స్ టేస్ట్ ఎప్పుడెలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి.. మామూలుగా అయితే ఓటిటిలో పాత సినిమాలు.. థియేటర్లలో కొత్త సినిమాలు చూడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది.

కొత్త సినిమాలను ఓటిటిలో వచ్చే వరకు వెయిట్ చేసి.. పాత సినిమాల కోసం థియేటర్స్ వైపు పరుగులు తీస్తున్నారు ప్రేక్షకులు.ఖలేజా సినిమాను రీ రిలీజ్ చేస్తే.. థియేటర్లకు పోటెత్తారు మహేష్ అభిమానులు.

ఎంతలా అంటే.. అదేరోజు విడుదలైన కొత్త సినిమా భైరవంను కూడా డామినేట్ చేసేలా..! ఫస్ట్ డే కలెక్షన్స్‌లోనూ భైరవంను మంచి మార్జిన్‌తో క్రాస్ చేసింది ఖలేజా. అంతేకాదు.. మొన్నామధ్య గబ్బర్ సింగ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ చిన్న, మీడియం రేంజ్ కొత్త సినిమాలకు వసూళ్లు రావట్లేదు.

నోస్టాలజీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.. అందులోనూ నిన్నటి జనరేషన్ మూవీ లవర్స్ తమ చిన్నప్పటి సినిమాలను థియేటర్స్‌లో చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అందుకే పాత సినిమాలకు వచ్చిన రిసెప్షన్ కొత్త సినిమాలకు కనిపించట్లేదనేది విశ్లేషకుల వాదన. కొత్త సినిమాలను మాత్రం ఓటిటిలో వచ్చాక చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు.

ఈ రోజుల్లో ఏ సినిమా అయినా 30 రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తుంది.. ఆ ధైర్యంతోనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడమే మానేస్తున్నారు.. పైగా స్టార్ హీరోల సినిమాలే రావట్లేదు. థియేటర్స్ ఇష్యూకు ఇది కూడా ఓ కారణమే. ఇదే కంటిన్యూ అయితే.. ఓటిటి కొత్త సినిమాల కోసం.. థియేటర్స్ పాత సినిమాల కోసం వాడాల్సిందే.