5 / 5
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన సెన్సేషనల్ లవ్ స్టోరీ బేబీ. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అక్కడా సాయి రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఓ ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ ఇందులో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.