1 / 8
తెలుగమ్మాయి ఈషా రెబ్బ అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఈషా రెబ్బా అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంపరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేతలో పూజాహెగ్డే సిస్టర్ గా నటించింది ఈషా. ఇటీవలే 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది ఈ చిన్నది. ప్రస్తుతం సుదీర్ బాబుకు జోడిగా మామ మశ్చేంద్ర చిత్రంలో నటిస్తుంది.