
సినిమా తరాల ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా చక్కర్లు కొడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఓ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

ఆమె ఎవరో కాదు అందాల భామ సయేషా. క్రేజీ బ్యూటీ సయేషా 2015లో అఖిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా.. సయేషా అందానికి మంచి మార్కులు పడ్డాయి.

అఖిల్ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. హిందీ సినిమాలతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ అందాల భామ.

అక్కడ తక్కువ కాలంలోనే సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఆర్య వంటి హీరోలతో సయేషా నటించింది. ఓ తమిళ్ సినిమా షూటింగ్ లో ఆర్య , సయేషా మధ్య ప్రేమ చిగురించింది. 2019లో ఆర్య, సయేషాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

ఆగస్టు 12న ముంబైలో జన్మించింది సయేషా. ఆమె బాలీవుడ్ నటుడు సైరా బాను, దిలీప్ కుమార్‌లకు మనవరాలు. పెళ్లి తర్వాత సయేషా సినిమాలకు దూరంగా ఉంటుందో. ఈ స్టార్ కపుల్ కు ఓ కూతురు కూడా ఉంది.