
హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. ఇటీవలే ఓ సాలిడ్ బల్క్ బస్టర్ హిట్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

తన అందంతోనే నటనతోనూ ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది ఆ అమ్మడు మరెవరో కాదు ఆమె శ్రీయ రెడ్డి.

విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో లేడీ విలన్ గా నటించి అందరిని అవాక్ అయ్యేలా చేసింది శ్రీయారెడ్డి. ఇక ఇప్పుడు మరోసారి వరుస సినిమాలతో బిజీ కానుంది.

ఇటీవలే సలార్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది ఈ ఆముద్దుగుమ్మ, త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీలోనూ నటించనుంది.