Tollywood : తెలుగులో క్రేజీ హీరోయిన్.. నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా..

Updated on: Jan 24, 2026 | 1:28 PM

ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. ఊహించని విధంగా కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ విషయాలు పంచుకుంటుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల ఆరాధ్య దేవత.

1 / 5
తెలుగులో అప్పట్లో క్రేజీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆసిన్. తెలుగుతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చక్రం తిప్పింది. 16 ఏళ్లకే మలయాళీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కొచ్చిలో జన్మించిన ఆమె తండ్రి మాజీ CBI అధికారి,  తల్లి డాక్టర్.

2 / 5
ఆసిన్ మోడలింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి BPL ప్రకటన ద్వారా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆమె 16 సంవత్సరాల వయసులో మలయాళ చిత్రం 'నరేంద్రన్ మకన్ జయకాంతన్ వకా' (2001)తో సినీరంగ ప్రవేశం చేసింది.

3 / 5
2003లో విడుదలైన 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ వరుస అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా సంచలనంగా మారింది.

4 / 5
 నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, వెంకటేశ్ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి బ్లా్క్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఆసిన్ 2016లో మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకుంది. వారి కుమార్తె అరిన్ రెయిన్ శర్మ 2017లో జన్మించింది.

5 / 5
ఆసిన్ భర్త రాహుల్ మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు. నివేదిక ప్రకారం, రాహుల్ తన తండ్రి నుండి రూ. 3 లక్షల రుణంతో 2000 సంవత్సరంలో ఈ వెంచర్‌ను ప్రారంభించాడు. భారతదేశంలో మొట్టమొదటి AI-ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ 'రివోల్ట్ ఇంటెలికార్ప్'ను కూడా ఆయన ప్రారంభించారు. ఆయన ఆస్తులు రూ.1300 కోట్లు.