
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. తెలుగులో దాదాపు 4 సినిమాల్లో నటించింది. కానీ ఆ చిత్రాలన్ని అట్టర్ ప్లా్ప్ అయ్యాయి. దీంతో కనిపించకుండా పోయింది.

ఆమె మరెవరో కాదు.. దిగంగన సూర్య వంశీ. బాలీవుడ్ బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కథానాయికగా అలరించింది. హిప్పీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఆ తర్వాత తెలుగులో గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమాలో నటించింది. ముఖ్యంగా ఈ సినిమాలో తమన్నానే డామినేట్ చేసింది. అలాగే ఆది సాయి కుమార్ క్రేజీ ఫెలో మూవీలో ఈ ముద్దుగుమ్మ నటిగా కనిపించింది. కానీ తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.

1997లో అక్టోబర్ 15న జన్మించిన దిగంగన సూర్య వంశీ... తెలుగు, హిందీ భాషలలో తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అలాగే నెట్టింట నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్యూటీకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం దిగంగన సూర్య వంశీ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి.