తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని పేరు హీరోయిన్ హంసా నందిని. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
ఒకటవుదాం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అనుమానాస్పదం సినిమాతో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అధినేత, అహా నాపెళ్లంటా చిత్రాల్లో నటించి మెప్పించింది.
అయితే హంసానందినికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించుకుంది. మిర్చి, భాయ్, రామయ్య వస్తావయ్యా వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది హంసానందిని. గతంలో క్యాన్సర్ బారిన హంసానందిని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటుంది.
ఇటీవల రెండేళ్ల క్రితం కేరళ మున్నార్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా పలు కథనాల్ని పోస్ట్ చేసింది. అలాగే అప్పట్లో వంట కార్యక్రమాలను షేర్ చేసింది హంసానందిని.
ఇక ప్రస్తుతం హంసానందిని సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఈద్ ముబారక్ అంటూ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
అందులో హంసానందిని సాంప్రదాయబద్ధంగా చీరలో ముచ్చటగా కనిపిస్తోంది. పచ్చని బ్యాక్ గ్రౌండ్ లో ఎంతో అందంగా ఫోజులిచ్చింది.
అందులో హంసానందిని సాంప్రదాయబద్ధంగా చీరలో ముచ్చటగా కనిపిస్తోంది. పచ్చని బ్యాక్ గ్రౌండ్ లో ఎంతో అందంగా ఫోజులిచ్చింది.