
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. ఐదేళ్ల వయసులోనే శాస్త్రీయ నృత్యాల్లో శిక్షణ ప్రారంభించిన ఈ అమ్మడు.. కథాకళి, భరతనాట్యం, మోహనీ అట్టం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు నేర్చుకుంది.

అంతేకాదు.. ఈ వయ్యారి మార్షల్ ఆర్ట్స్ లోనూ ట్రైనింగ్ తీసుకుంది. ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. కేరళకు చెందిన ప్రత్యేకమైన కలరిపయట్టు మార్షల్ ఆర్ట్స్ లోనూ ఆమె దిట్ట. గతేడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.

అటు ఉన్నత చదువుల కోసం సద్ధమవుతూనే ఇటు సినిమాల్లో రాణిస్తుంది. తెలుగులో ఇప్పటివరకు చేసిన ఒక్క సినిమా సైతం సూపర్ హిట్ అయ్యింది. అదే మ్యాడ్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

మ్యాడ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ పై ఇప్పటిక మంచి ఆసక్తి నెలకొంది.

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అనంతిక.. తాజాగా చీరకట్టులో సముద్రం ఒడ్డున ఫోట్ షూట్ చేసింది. పర్పుల్ కలర్ చీరలో మరింత అందంగా కనిపించింది ఈ వయ్యారి. ఇప్పుడు ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.