
శర్వానంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే.. చెప్పే సినిమా రన్ రాజా రన్ సినిమా ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శర్వానంద్ తో కలిసి నటించిన హీరోయిన్ గుర్తుందా.?

ఆ చిన్నదాని పేరు సీరత్ కపూర్. రన్ రాజా రన్ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. కానీ ఆ సక్సెస్ అందుకోలేకపోయింది.

ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా.. ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

అయితే ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఆమె చివరిసారిగా మా వింత గాధ వినుమా సినిమాలో నటించింది. ఇక ఇటీవల హిందీలో మారిచ్ అనే క్రైం థ్రిల్లర్ లో నటించింది. కానీ అక్కడ బాగానే క్లిక్ అయ్యింది ఈ భామ.

నటిగానే కాదు బాలీవుడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ గానూ రాణిస్తుంది. సీరత్ మంచి డాన్సర్ కూడా.. సీరత్ తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు. కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంత ఇంత కాదు.