మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఈరోజుల్లో.. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యువతను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా వందరోజులు ఆడింది. శ్రీని, రేష్మ, సాయి, భార్గవి ప్రధాన తారాగణంగా నటించారు.
ఈ చిత్రం 2012 లో అత్యంత విజయవంతమైన టాలీవుడ్ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం కన్నడంలో "ప్రీతి ప్రేమ" అనే పేరుతో రీమేక్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.?
ఆమె పేరు రేష్మా రాథోడ్ . ఈ ముద్దుగుమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినీ నటి,రేష్మారాథోడ్ మొగలిరేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమై, 2012లో విడుదలైన బాడీగార్డ్ సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది.
2013లో ఈ రోజుల్లో చిత్రంలో హీరోయిన్‌గా మారింది. ఆమె తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించింది.రేష్మా రాథోడ్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయింది. ఆమె ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తుంది.
ఈ అమ్మడు 'లా' పూర్తి చేసింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.