

కానీ ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో సినిమా నుంచి నాని తప్పుకోవాల్సి వచ్చిందంట. అతే కాకుండా అప్పుడు సునీల్‌కు మంచి క్రేజ్ ఉండటంతో, ఆయనను సంప్రదించడంతో ఆయన వెంటనే ఒకే చెప్పేశారంట.

ఇంతకీ ఆ మూవీ ఏంటో అర్థం అయ్యిందా.. తడాఖా. ఇలా నాని, నాగచైతన్య కాంబోలో రావాల్సిన తడాఖామూవీ, సునీల్, చైతూ కాంబోలో తెరకెక్కిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో సునీల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. అమాయకత్వంతో కనిపిస్తూ.. సునీల్ తన పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. మొదట్లో చాలా అమాయకంగా ఉండి, తర్వాత ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మారిపోతాడు.

అయితే ఈ పాత్రలో నాని చేసి ఉంటే ఇంకా సూపర్ ఉండేది, క్రేజీ కాంబో మిస్ అయ్యింది అంటున్నారు నాని అభిమానులు. ఇక ప్రస్తుతం నాని వరస బ్లాక్ బస్టర్స్‌తో దూసుకెళ్తున్నాడు. ఇక చైతూ, తండేల్ మూవీ సక్సెస్ ఏంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.