
గ్లామర్ ఇండస్ట్రీలో పెళ్లి, రిలేషన్‌షిప్స్ అనేవి నటీమణుల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేదానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించాలనుకునే వారికి పెళ్లి అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారుతుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఇదే విషయంపై పాపులర్ తెలుగు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు విషయంలోనూ అదే జరిగింది. పెళ్లైందని ఓపెన్‌గా చెప్పడం వల్లే చేతికి వచ్చిన ఒక మంచి సినిమా అవకాశం చేజారిపోయిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

స్రవంతి చొక్కారపు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకునే ఈ భామ.. బిగ్ బాస్ నాన్‌స్టాప్ (OTT) సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈమెకు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడనే విషయం చాలా మందికి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేంతవరకు తెలియదు. కెరీర్ ప్రారంభంలోనే ఆమె ప్రశాంత్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. సాధారణంగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా పెళ్లిని దాస్తుంటారు. కానీ స్రవంతి మాత్రం అలా దాచకుండా నిజాయితీగా ఉండటమే ఆమెకు మైనస్ అయిందట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్రవంతి, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకుంది. "నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం ఆడిషన్స్ ఇచ్చాను. నటన పరంగా, లుక్స్ పరంగా నన్ను అన్ని విధాలా ఓకే చేశారు. ఆ పాత్రకు నేను పర్ఫెక్ట్‌గా సెట్ అవుతానని మేకర్స్ భావించారు. అయితే, ఫైనల్ డిస్కషన్స్ సమయంలో క్యాజువల్‌గా మాట్లాడుతూ.. నాకు పెళ్లైందా అని అడిగారు. నేను ఏమాత్రం దాచకుండా ‘అవును, నాకు పెళ్లయింది’ అని నిజం చెప్పేశాను. అంతే.. ఆ మాట వినగానే వారి ఎక్స్‌ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి" అని స్రవంతి చెప్పుకొచ్చింది.

ఆ మరుసటి రోజు చెన్నై వెళ్లి షూటింగ్ లో పాల్గొనాలని.. అక్కడకు వచ్చి అడ్వాన్స్ తీసుకోవాలని చెప్పారు. కానీ పెళ్లి అయ్యిందనే విషయాన్ని చెప్పడంతో ఆ మేనేజర్ గంటలో కాల్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కాల్ రాలేదు. ఆ సినిమా కూడా లేదు. పెళ్లి అయ్యిందనే విషయాన్ని చెప్పి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఆ తర్వాత సినిమా కూడా ఆగిపోయిందని తెలిసింది అంటూ చెప్పుకొచ్చింది. స్రవంతి తన కెరీర్‌ను చిన్న యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా మొదలుపెట్టిన ఆమె, అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రి బాగా పాపులర్ అయ్యారు.

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ నాన్-స్టాప్ (OTT మొదటి సీజన్) లో పాల్గొని ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె అనేక సినిమా ఆడియో లాంచ్‌లు, ప్రైవేట్ కార్యక్రమాలు , సెలబ్రిటీ ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. : 2009లోనే పరిశ్రమలోకి ప్రవేశించినా, ఇటీవలే నటిగా తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా సుహాస్ హీరోగా నటించిన 'హే బల్వంత్' (లేదా హే భగవాన్) చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఇన్ స్టాలో క్రేజీ గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.