
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో కుర్రవాళ్ల ఆరాధ్య దేవతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. కోలీవుడ్ హీరోయిన్ దివ్య భారతి. బ్యాచిలర్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. మొదటి చిత్రంతోనే ఊహించని రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఇప్పుడు ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలతోపాటు క్రేజ్ సొంతం చేసుకుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో దివ్యభారతి ఫాంటసీ హారర్ అడ్వెంచర్ మూవీ కింగ్‌స్టన్ చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం తెలుగులో గోట్ చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. రెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ లో కనిపిస్తుంది ఈ వయ్యారి. దివ్య భారతి ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.

సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీడ్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్స్ అందుకోనుట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దివ్య భారతి స్టన్నింగ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.