టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడు ఎవరు ముందుగా చెప్పే పేరు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబకథలను తెరకెక్కించడం లేదు శేఖర్ కమ్ముల దిట్ట. శేఖర్ కమ్ముల సినిమాలే కాదు ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకునే హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. అలా ఆయన సినిమాల్లో మెరిసిన హీరోయిన్స్ లో కమలిని ముఖర్జీ ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్, గోదావరి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కమలిని ముఖర్జీ. చూడ చక్కని రూపం. అచ్చం మన పక్కింటి అమ్మాయిలా నటించింది కమలిని ముఖర్జీ.