Alia Bhatt: డైరెక్టర్ నాగి చేతిలో అలియా కెరియర్.. బడా స్టార్స్ చూపులన్నీ సౌత్ వైపే.!
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మరో సౌత్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ట్రిపులార్‌తో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఇప్పుడు మరో పాన్ ఇండియా డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఉన్న ఆలియా భట్, ట్రిపులార్‌తో సౌత్ ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ కావటంతో చిన్న పాత్రే అయినా నటించేందుకు ఓకే చెప్పారు ఈ క్యూటీ.