
రొమాంటిక్ మూవీస్, ఫ్యామిలీ డ్రామాలతో పోల్చుకుంటే మాస్ కమర్షియల్ సినిమాలకు ఆడియన్స్ రెస్పాన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కిన సినిమాలే బాక్సాఫీస్ దగ్గర బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేస్తాయి. ఫ్యాన్స్‌లో ఉండే ఎగ్జైట్మెంటే అందుకు కారణం. అభిమాన నటులు అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేస్తుంటే సీట్ ఎడ్జ్‌లో కూర్చోని చూడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. తమ ఫేవరెట్ స్టార్స్ చేసే రియల్ స్టంట్స్ ఫ్యాన్స్‌కు ఆ రేంజ్‌లో కిక్కిస్తాయి. ఇన్నాళ్లు ఇదే ఎగ్జైట్మెంట్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.

స్సై యూనివర్స్‌లో సూపర్ హిట్ అయిన వార్‌కు సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ తోపాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తుండటంతో ఈ సినిమా మీద సౌత్ సర్కిల్స్‌లో కూడా మంచి బజ్ ఉంది. అందుకే ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన న్యూస్ దక్షిణాదిలోనూ టాప్‌లో ట్రెండ్ అయ్యింది.

ఇటీవల హీరోలిద్దరూ లేకుండానే వార్ 2 షూటింగ్ మొదలు పెట్టేశారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. స్పెయిన్‌లో భారీ చేజ్ సీన్‌ను చిత్రీకరించారు. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియోలు చూసే ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. హీరోలిద్దరు షూటింగ్‌లో పాల్గొనకపోవటంతో వాళ్ల అవసరం లేని సీన్స్ ఏవైన తీసుంటారని అనుకున్నారు అభిమానులు. కానీ ఫోటోస్‌లో హృతిక్, ఎన్టీఆర్ బాడీ డబుల్స్ కనిపించటంలో షాక్ అయ్యారు.

యాక్షన్ సీన్స్ విషయంలో హీరో రియల్‌గా పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్న అభిమానులకు ఈ ఫోటోస్ షాక్ ఇచ్చాయి. మెయిన్ యాక్షన్ సీన్స్ అన్ని ఇలా డూప్స్‌తోనే కానిచ్చేస్తే ఇక హీరోలు చేసేది ఏంటి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక హీరోల అభిమానులైతే ఈ ఫోటోలు లీక్ చేయటం అవసరమా అంటూ యూనిట్ సభ్యుల మీద మండి పడుతున్నారు. మరి డ్యామేజ్‌ను వార్ 2 టీమ్ ఎలా కవర్ చేస్తుందో చూడాలి.

ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే జనవరి నుంచి వార్ 2 షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.