Dimple Hayathi: అందాల భామకు ఆఫర్స్ కరువయ్యాయిగా.. స్టార్ హీరోల సినిమాల కోసం డింపుల్ ఎదురుచూపులు..
అందం అభినయం ఉన్న కొంతమంది ముద్దుగుమ్మలకు అదృష్టం కలిసి రాదు అలాంటి భామల్లో డింపుల్ హయతి ఒకరు. 2017లో వచ్చిన గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది. తమిళ్ లో దేవి 2 , అభినేత్రి 2 సినిమాల్లో నటించింది. ఆతర్వాత తెలుగులో హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ తో తన అందాలతో అందిరిని అవాక్ అయ్యేలా చేసింది.