
కుబేరా నిజంగా అనుకున్న టైమ్‌కు వస్తుందా రాదా అనే అనుమానాలు ఇంక అవసరం లేదు. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ క్లారిటీనే మేకర్స్ ఇచ్చేసారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది చూసాక అంచనాలు మరింత పెరగడం ఖాయం. మరింతకీ ఈ టీజర్‌లో ఏముంది..? అసలు కుబేరా కాన్సెప్ట్ ఏంటి..? శేఖర్ కమ్ముల ఏం మ్యాజిక్ చేయబోతున్నారు..?

చూస్తున్నారుగా.. టీజర్ కూడా రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా డిఫరెంట్‌గా కట్ చేసి తన మార్క్ చూపించారు శేఖర్ కమ్ముల. తాజాగా విడుదలైన టీజర్‌తో కుబేరాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి.

ముఖ్యంగా ఇందులో తన సినిమా కాన్సెప్ట్ చూపించారు కమ్ముల. బిజినెస్ మెన్, పేదవాడికి మధ్య సాగే అంతర్యుద్ధమే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. నాది నాది నాదే ఈ లోకమంతా.. అంటూ సాగే సాంగ్ టీజర్‌లో క్యారెక్టర్స్ అన్నీ పరిచయం చేసారు శేఖర్ కమ్ముల.

ఇందులో ధనుష్ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున పాత్ర డిఫెరెంట్‌గానే ఉంది. వీళ్లిద్దరి మధ్యలో రష్మిక మందన్న, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బా పాత్రలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముంబైలోని ధారావి నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. లవ్ స్టోరీ తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని కుబేరా సినిమాను తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల.

దాదాపు 2 నిమిషాల టీజర్‌లో కథపై ఎక్కడా హింట్ ఇవ్వలేదు మేకర్స్. ముంబై నేపథ్యంలో సాగే మాఫియా కథ అనేది మాత్రం అర్థమవుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. జూన్ 20న విడుదల కానుంది కుబేరా.