
ధనుష్ తమిళ హీరో అనే ట్యాగ్ లేదిప్పుడు. ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు బాలీవుడ్‌లోనూ రఫ్ఫాడించేస్తున్నారు. అయినా, ఆయనకు డైరక్ట్ చేయాలన్న ఇంట్రస్ట్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన ప్యాషన్‌కి టైమ్ లేదనే సాకు అడ్డు రావడం లేదు. రీసెంట్‌గా జాబిలమ్మ నీకు అంత కోపమా... మూవీతో కెప్టెన్‌గా మంచి సక్సెస్ అందుకున్నారు ధనుష్

అతి త్వరలో ధనుష్ డైరక్షన్‌లో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారన్నది వైరల్ టాపిక్. అజిత్ కెరీర్ గత కొన్నాళ్లుగా సంప్‌లో ఉంది. రీసెంట్‌గా సినిమాలు ఆడలేదు.

అందులో నుంచి ఆయన్ని బయటపడేయడానికి ధనుష్ దగ్గర సూపర్ డూపర్ స్క్రిప్ట్ ఉందని, దాన్ని ఆయనే డైరక్ట్ చేయాలని అనుకుంటున్నారని కోలీవుడ్ న్యూస్. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయ్యాక అజిత్.. ఈ స్క్రిప్ట్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తారట.

స్టార్ హీరో ఇలా ఇంకో స్టార్ హీరోని డైరక్ట్ చేస్తున్నారనే టాక్ స్ప్రెడ్ కాగానే అందరికీ లూసిఫర్ కాంబో గుర్తుకొచ్చేసింది. మోహన్‌లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సక్సెస్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

లూసిఫర్‌కి సెకండ్ పార్టు కూడా రెడీ అయింది. ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఎల్2 ఎంపురాన్. ఫస్ట్ పార్టులో మోహన్‌లాల్‌కి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన పృథ్విరాజ్ సుకుమారన్.. సెకండ్ పార్టుని ఎలా డిజైన్ చేశారో చూడాలనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. సో మలయాళంలో పృథ్వి, తమిళ్‌లో ధనుష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫిల్మ్ నగర్ అన్నమాట.