Devi Sri Prasad: సినిమాకు ప్రాణం గా నిలుస్తున్న దేవీ మ్యూజిక్

Edited By:

Updated on: Jun 23, 2025 | 9:31 PM

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటూ చిన్నపుడు చదువుకున్న పద్యం గుర్తుంది కదా..? ఇప్పుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను చూస్తుంటే ఇదే గుర్తుకొస్తుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేసేంత క్రేజ్ ఉన్నా.. కావాలనే అలా ఓ గ్యాప్ ఇస్తుంటారీయన. కమర్షియల్ బ్రేక్ ఇచ్చినా.. కావాల్సినన్ని రోజులు గుర్తుండిపోయే పాటలిస్తుంటారు. తాజాగా మరోసారి దేవీ మేనియా మొదలైంది.

1 / 5
దేవీ శ్రీ ప్రసాద్.. మాటల కంటే ఎక్కువగా పాటలతోనే పలకరించే వ్యక్తి ఈయన. DSP అని స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. సగం సినిమా హిట్టైపోయినట్లే. ఈయన గ్యాప్ ఇచ్చినా.. ఆడియన్స్ మాత్రం ఆయన పాటలను గ్యాప్ లేకుండా వింటుంటారు.

2 / 5
అదే దేవీ మ్యాజిక్. కొన్ని రోజులుగా మరోసారి దేవీ మ్యూజిక్ మేనియా మొదలైంది. ఒకప్పుడు ఏడాదికి 10 సినిమాలు కూడా చేసిన దేవీ.. ఈ మధ్య ఆ లెక్క బాగా తగ్గించేసారు.

3 / 5
తెలుగులో 2023లో వాల్తేరు వీరయ్య.. 2024లో పుష్ప 2 సినిమాలకు మాత్రమే సంగీతం అందించారు. ఈ రెండింటికీ దేవీ మ్యూజికల్ మ్యాజిక్ ఎలా పని చేసిందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ ఏడాది తండేల్‌కు తన పాటలతో ప్రాణం పోసారు దేవీ.

4 / 5
అలాగే తాజాగా కుబేరాతో మాయ చేస్తున్నారీయన.ఒకప్పట్లా వేగంగా సినిమాలు చేయాలనే ధ్యాసేం లేదు దేవీకి. చేసిన కొన్ని సినిమాలైనా గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పుష్ప 2, తండేల్, కుబేరాతో దేవీ శ్రీ ప్రసాద్ మళ్లీ రేసులోకి వచ్చారు.

5 / 5
ప్రస్తుతం మోహన్ లాల్ వృషభకు సంగీతం అందిస్తున్నారు దేవీ. మొత్తానికి చేసే సినిమాల సంఖ్య తగ్గినా.. చేసిన ప్రతీ పాటతో పూనకాలు పుట్టించాలని చూస్తున్నారు దేవీ.