Devi Sri Prasad: కాపీ క్యాట్స్‌పై దేవీ శ్రీ ప్రసాద్ రియాక్షన్

| Edited By: Phani CH

Mar 18, 2025 | 9:27 PM

ఈ రోజుల్లో ఏ పాట విన్నా కూడా ఎక్కడో విన్నట్లుందే అనిపించడం కామన్. ఎంత ఒరిజినల్ ట్యూన్ ఇచ్చినా.. కాపీ ముద్ర పడిపోతుంది. అయితే దీనిపై ఎవరు పట్టించుకున్నా లేకపోయినా.. దేవీ శ్రీ ప్రసాద్ మాత్రం బాగా గట్టిగా స్పందిస్తారు. తాజాగా మరోసారి కాపీ ట్యూన్స్ గురించి హాట్ కామెంట్స్‌తో కాక పుట్టించారు DSP. మరి ఆయనేం అన్నారో చూద్దామా..?

1 / 5
కాపీ ట్యూన్.. ఈ మధ్య తెలుగులోనే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. తమన్, అనిరుధ్, దేవీ శ్రీ ప్రసాద్, కీరవాణి.. సంగీత దర్శకుడితో పనిలేదు.. పాట ఎవరిదైనా ఫలానా సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ ఆడియన్స్ ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు.

2 / 5
కానీ వాళ్లేమో అది దొంగిలించుట కాదు తస్కరించుట అంటున్నారు. అంటే ఇన్‌స్పిరేషన్ అన్నమాట. తమన్ కాపీ ట్యూన్స్‌పై చాలాసార్లు మాట్లాడారు. కాపీ కొడితే మా అమ్మ అన్నం పెడుతుందా అంటూ మనోడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి కూడా.

3 / 5
తాజాగా దేవీ కూడా కాపీ ట్యూన్స్‌పై స్పందించారు. అవసరం కన్నా ఇది లగ్జరిగా మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసారు దేవీ. తనకెప్పుడూ అలాంటి లగ్జరీతో పని పడలేదన్నారు DSP.

4 / 5

కాపీ కాదు కదా.. కనీసం ఇప్పటి వరకు ఒక్క పాటను కూడా రీమిక్స్ చేయకుండా కెరీర్ కొనసాగించానని చెప్పారు దేవీ. గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ పాత పాటను రీమిక్స్ చేయాలంటూ హరీష్ శంకర్ కోరారని.. దానికోసం ఆ సినిమానే వదిలేసానన్నారు దేవీ.

5 / 5
ప్రస్తుతం కుబేరాతో పాటు మోహన్ లాల్ ప్యాన్ ఇండియా సినిమా వృషభ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నారీయన.