
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అందాల దీపికా పదుకొనె.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది దీపిక పదుకొనె.

ప్రస్తుతం బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది దీపిక.. అంతే కాదు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈ బ్యూటీ.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టనుంది దీపికా పదుకొనె. ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది దీపికా.

దీపికా పదుకొణె త్వరలో ఓ కొత్త హాలీవుడ్ సినిమాలో నటించనుందని సమాచారం. దీపికా పదుకొణె 'ఇంటర్న్' అనే చిత్రంలో నటిస్తోంది, ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నారు.

రోహిత్ శెట్టి కొత్త సినిమాలో దీపిక 'లేడీ సింగం'గా కనిపించనుంది. అలాగే దీపిక ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి 'ఫైటర్'లో నటిస్తుంది.