Daaku Maharaaj: డాకు మహారాజ్‌’ సక్సెస్‌ ఈవెంట్‌ అక్కడే చేస్తామంటున్న నాగవంశీ

|

Jan 12, 2025 | 4:42 PM

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.. తెల్లవారు జాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది.

1 / 5
'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించబోతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

2 / 5
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు.

3 / 5
బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది.

4 / 5
ఇది ఇలా ఉంటే త్వరలోనే సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. ‘డాకు మహారాజ్‌’  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు అయిన అనంతపురంలోనే సక్సెస్‌ ఈవెంట్‌ నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు.

5 / 5
ఆదివారం విడుదలైన ఆ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ లో ఆయన మాట్లాడారు. నాగవంశీతోపాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశీ రౌతేలా విలేకరుల సమావేశంలో పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు.