
కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలీ

ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు.

అలీ భార్య జుబేదా కూడా యూట్యూబ్ చానెల్ ను నిర్వహిస్తోంది. ఆమెకు లక్షల సంఖ్యలో సబ్స్రైబర్లు ఉన్నారు.

అలీకి ముగ్గురు సంతానం కాగా.. పెద్దకూతురు ఫాతిమా ఇటీవలే వైద్య విద్యను పూర్తి చేసింది

ఈ నేపథ్యంలో ఆమెకు ఎంగేజ్మెంట్ నిర్వహించారు. త్వరలోనే పెళ్లి జరగనుంది. ముస్లిం సంప్రదాయం ప్రకారం అలీ కూతురు ఎంగేజ్ మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

అంతేకాదు..అలీ వియ్యంకుల వారింటా అందరూ డాక్టర్లేనని అలీ భార్య జుబేదా తన వీడియోలో అందరినీ పరిచయం చేశారు.

ఈ వేడుకకు సినీనటుడు డైలాగ్ కింగ్ సాయికుమార్ దంపతులు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

ముస్లిం సంప్రదాయం ప్రకారం అలీ కూతురు ఎంగేజ్ మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.