
తన కెరీర్‌లో విలువైన విజయం అంటూ ట్రిపుల్ ఆర్ గురించి హ్యాపీగా చెప్పుకున్నారు జక్కన్న. ట్రిపుల్ ఆర్‌కి సీక్వెల్ ఉంటుందా? అని అడిగితే, ఏమాత్రం ఆలోచించకుండా యస్ అంటూ చటుక్కున చెప్పేశారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ సీక్వెల్ సంగతి సరే, ముందు మా యస్ యస్ ఎంబీ29 గురించి చెప్పమంటున్నారు జనాలు.

ఎస్ఎస్ఎంబీ 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా నోరు విప్పలేదు. ఏదో ఒక విషయం చెప్పండి గురూ అని రకరకాలుగా రిక్వెస్టులు పెడుతున్నా, చిరునవ్వుతోనో, కొన్నిసార్లు కోపం నటించో.. సిట్చువేషన్‌ని దాటేస్తున్నారు జక్కన్న.

ఆయన చెప్పకపోతేనేం.. మా సోర్సులు మాకుంటాయి. మేం తెలుసుకుంటామనే ధీమా కనిపిస్తోంది ఘట్టమనేని సైన్యంలో. లేటెస్ట్ గా వాళ్ల మధ్య డిస్కషన్స్ షురూ చేసిన పేరు చియాన్ విక్రమ్. ఎస్ఎస్ఎంబీ 29లో చియాన్ విక్రమ్ కీ రోల్ చేస్తారన్నది టాక్.

రీసెంట్‌గా జక్కన్న ఆయన్ని కలిసి స్క్రిప్ట్ చెప్పారన్నది వైరల్ న్యూస్. వీరధీరశూరన్‌తో కోలీవుడ్‌లో కాస్త ఊపిరి పీల్చుకున్నారు చియాన్. అమేజాన్ అడవుల్లో నిధి అన్వేషణ ప్రధానంగా రూపొందుతోంది ఎస్ఎస్ఎంబీ 29.

ఆల్రెడీ ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్‌తో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలో చియాన్ తో పాటు పలువురు హాలీవుడ్ నటులు కూడా సెట్స్ లో కనిపిస్తారన్నది ఫిల్మ్ నగర్ సమాచారం. వేరే లెవల్ మ్యూజిక్, వేరే లెవల్ ప్రొడక్షన్ అంటూ ఇప్పటికే హింట్స్ అందుతూనే ఉన్నాయి.