
మార్చ్‌లో పవన్ కళ్యాణ్ వస్తాడు.. ఎప్రిల్‌లో ప్రభాస్ వస్తాడు.. మేలో చిరంజీవి వస్తాడు అంటూ కలలు కంటున్న ఫ్యాన్స్‌కు షాక్ తప్పేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే హరిహర వీరమల్లు వాయిదా దాదాపు ఖాయమైపోయింది..!

ఎందుకంటే ఇన్నాళ్లూ ఏ పోస్టర్ విడుదల చేసినా అందులో రిలీజ్ డేట్ ఉండేది.. ఈసారి అది కూడా లేదు. దీంతో హరిహర వీరమల్లు మూవీ సమ్మర్‌లో విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు అభిమానులు.

తాజాగా హరిహర వీరమల్లు నుంచి మాట వినాలి సాంగ్ మేకింగ్ వీడియో విడుదల చేసారు. అందులో రిలీజ్ డేట్ లేదు. మొన్న బాబీ డియోల్ బర్త్ డే పోస్టర్‌లోనూ మార్చ్ 28న విడుదల అని వేసిన మేకర్స్.. ఈసారి మాత్రం ఆ రిలీజ్ డేట్ వేయలేదు.

దీంతో అసలు రిలీజ్ డేటే ఎందుకు వేయలేదు. ఈ లెక్కన వీరమల్లు వాయిదా అధికారికం అయిపోయినట్లేనా అంటూ అయోమయంలో పడిపోతున్నార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్!

చిరంజీవి విశ్వంభర కూడా మే 9 అంటున్నారు కానీ ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. 5 రోజుల టాకీతో పాటు 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ భారీగా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ సమ్మర్‌లోపు పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. అందుకే డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు మేకర్స్.