
ప్రస్తుతం ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టగలరా.. ? తెలుగులో ఫేమస్ హీరోయిన్. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళం భాషలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, వెంకటేష్ వంటి పెద్ద నటులతో కలిసి పనిచేసింది.

ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ అంజలి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ నటి ఇటీవల చీరకట్టులో క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. షాపింగ్ మాల్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు.

అలాగే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. అంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సీత పాత్ర కూడా ఆమెకు చాలా ప్రశంసలు , కీర్తిని తెచ్చిపెట్టింది. 2013లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేశ్ ప్రధాన పాత్రలలో నటించారు.

తెలుగులో గీతాంజలి అనే కామెడీ హర్రర్ చిత్రంలో కనిపించింది. ఇందులో తన కామెడీ టైమింగ్, యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో కీలకపాత్ర పోషఇంచింది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

తెలుగులో వరుస సినిమాలతో అలరించిన అంజలి.. ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమనులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.