
పైన ఫోటోలో ముద్దుగా, బొద్దుగా ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈరోజు ఈ ముద్దుగుమ్మ 35వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీతారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఒకప్పుడు తెలుగులో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రకుల్.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే కెరీర్ ఫాంలో ఉండగానే రకుల్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 204 ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకున్నారు.

రకుల్ ఇఫ్పుడు ఎక్కువగా హిందీలో నటిస్తుంది. ఇటీవలే ఆమె దే దే ప్యార్ దే 2 చిత్రంలో నటించింది. ఆయేషా ఖురానా పాత్రలో కనిపించనుంది. ఇందులో అజయ్ దేవగన్, ఆర్. మాధవన్, టబు కీలకపాత్రలు పోషించగా.. నవంబర్ 14న రిలీజ్ కానుంది.

చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది రకుల్. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ ముద్దగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.