
కెరీర్ బిగినింగ్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన ప్రతిభతో ఎంతో పాపులర్ అయ్యింది. ఆమె మరెవరో కాదు.. యాంకర్ కమ్ నటి అనసూయ. కెరీర్ తొలినాళ్లల్లో న్యూస్ రీడర్ గా వర్క్ చేసింది.

ఆ తర్వాత యాంకర్ గా మారి పలు షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాతో ఫేమస్ అయ్యింది.

దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా దూసుకుపోతుంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా నటించింది. ఇక ఇటీవలే పుష్ప చిత్రంలో సునీల్ జోడిగా కనిపించింది.

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుూ బిజీగా ఉంటుంది. అలాగే అటు సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ సందడి చేస్తుంది.