
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. హిందీలో మాత్రం వరుసగా డిజాస్టర్స్ అందుకుంటుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కీర్తి సురేష్. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనక దంపతుల చిన్న కుమార్తె కీర్తి. 2000లో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలో వరుస చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ డిగ్రీ పూర్తి చేసింది.

మలయాళంలో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా మారింది కీర్తి. మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకున్న కీర్తి.. ఆ తర్వాత నేను శైలజ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆ తర్వాత మహానటి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో వరుస చిత్రాల్లో నటించింది కీర్తి.

కానీ హిందీలో ఆమె నటించిన బేబీజాన్ చిత్రం మాత్రం డిజాస్టర్ అయ్యింది. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సత్తా చాటిన కీర్తి.. హిందీలో మాత్రం అంతగా ఫేమస్ కాలేకపోయింది.