Rajeev Rayala |
May 21, 2022 | 7:00 AM
ప్రముఖ కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజనా గల్రాని తల్లిగా ప్రమోషన్ పొందింది.
ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిషతో పాటు నటించిన మరో హీరోయిన్ సంజనా గల్రాని. ఆ సినిమాలో వచ్చిరానీ తెలుగు భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ.
తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో తెలిపింది.
ఈ సినిమా తర్వాత సత్యమేవ జయతే, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది.
కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ గతేడాది కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది.
శాండల్ వుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్టై, మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్ బాషా అనే వ్యక్తితో పెళ్లిపీటలెక్కింది.
ఆపై ఆమె కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. కాగా కొన్ని నెలల క్రితం తల్లికానున్నట్లు ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ ఘనంగా బేబీ షవర్ వేడుకలు జరుపుకొంది. తాజాగా పండంటి మగబిడ్డను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది.