
అమితాబ్ బచ్చన్ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రోజు రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇటీవల అమితాబ్ బచ్చన్ ఓ ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు.

ఈ ఫోటో వైరల్ గా మారింది. అమితాబ్ బచ్చన్ తన బంగ్లాలో పూజా మందిర్ ను చూపించారు. ఈ ఫోటోల్లో అమితాబ్ బచ్చన్ తన ఇంట్లోని పూజ మందిర్ లోని రాముడి విగ్రహాలను అలాగే శివ లింగాన్ని చూపించారు.

ఆ విగ్రహాలకు అమితాబ్ అభిషేకం చేస్తూ కనిపించారు. అలాగే అమితాబ్ బచ్చన్ తులసికి నీరు పోస్తూ కనిపించారు. అమితాబ్ బచ్చన్ యొక్క ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోపై అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ రెండు సార్లు అయోధ్యను సందర్చించారు. గతంలో ప్రాణ ప్రతిష్ఠ రోజు అయోధ్యకు వెళ్లారు. ఆ తర్వాత రీసెంట్ గా కూడా వెళ్లారు బిగ్ బి.