
బెస్ట్ డ్యాన్సర్ గా సత్తా చాటింది విదేశీ ముద్దుగుమ్మ నోరా ఫతేహి. బాలీవుడ్ టాలీవుడ్ లలో ఐటమ్ నంబర్లతో అదరగొట్టింది.

బాహుబలి మనోహరిగా నోరాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

సౌత్ నార్త్ అనే విభేధం లేకుండా నోరా ఐటమ్ నంబర్లు యూత్ కి బోలెడంత కిక్కిచ్చాయి. సింగిల్ ఆల్బమ్స్ తోనూ మెరుపులు మెరిపించింది.

ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లులో అవకాశం దక్కించుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమాలో నోరా కీలక పాత్ర పోషిస్తోంది.. అత్యంత కీలక మలుపునిచ్చే పాత్రలో కనిపించనుందట.

నోరా ఫతేహి మొగల్ రాజు ఔరంగజేబు సోదరిగా నటిస్తోంది. ఔరంగజేబు సోదరితో స్నేహం చేసే వీరమల్లుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారని సమాచారం.

నోరా ఫతేహి ఓ పాటలో తన నృత్య ప్రదర్శనతో అదరగొట్టనుందని కూడా తెలిసింది.