
రేర్ రికార్డుకి డెఫినిషన్ ఎలా ఉంటుందో తెలుసా? నన్నడగండి నేను చెబుతాను. సరికొత్తగా స్పెల్లింగ్ నేర్చుకుని ఎగ్జయిటింగ్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానని అంటున్నారు నటి దీపిక పదుకోన్.

మూడు వెయ్యి కోట్లు, ఒక రెండు వేల కోట్లు... మిగిలినవన్నీ కలిపితే పదివేల కోట్లకు దగ్గరగా లెక్కలు చూపిస్తున్నారు ఈ బ్యూటీ. ఏంటా కౌంట్ అంటారా.?

పఠాన్ సినిమా సమయంలో దీపిక పదుకోన్ యాక్షన్ చూసి ఫిదా అయింది బాలీవుడ్. బాద్షాతో దీపిక స్క్రీన్ షేర్ చేసుకున్నాక బొమ్మ బ్లాక్‌బస్టర్ కాకుండా ఉంటుందా? బాక్సాఫీస్ బద్ధలు కాకుండా ఉంటుందా అని అనుకున్నారు.

అన్నట్టే వెయ్యి కోట్ల మార్కు దాటేసింది. అదే ఊపులో జవాన్‌తో ఇంకో వెయ్యి కోట్లను మూటగట్టేసింది ఈ జోడీ. సౌత్ బ్యూటీ దీపిక పదుకోన్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించిన ఫస్ట్ మూవీ కల్కి. ఆల్రెడీ వెయ్యి కోట్ల మార్కు దాటేసింది.

సెకండ్ పార్టులోనూ వీరిద్దరి పాత్రలు కీలకంగా ఉంటాయి. కాబట్టి, ఇంకో వెయ్యి కోట్లకు రూట్ రెడీ అవుతోంది. దీపిక హాలీవుడ్ సినిమాకు 2300 కోట్ల కలెక్షన్లు కనిపిస్తున్నాయి. అంతకు ముందు ఆమె చేసిన సినిమాల లిస్టు కూడా చాలా పెద్దదే.

వాటిలో తలా వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కోకొల్లలు. ఫ్లాపులున్నప్పటికీ, చెన్నై ఎక్స్ ప్రెస్‌లాంటి సినిమాలు 400 ప్లస్‌కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయాయి. దీపిక ఇప్పుడు నిండు గర్భిణి.

ఆఫ్టర్ డెలివరీ కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకుని మళ్లీ మేకప్ వేసుకున్నా, ఇకపై ప్రతిదీ ప్యాన్ ఇండియా సినిమానే అవుతుంది. సో.. ఇండియాలో ఇప్పటికైతే మరే బ్యూటీ ఖాతాలో లేనన్ని వెయ్యి కోట్ల సినిమాలు, భారీ కలెక్షన్లు ఈ లేడీకి మాత్రమే సొంతం.