Akshay Kumar: క్రమంగా తగ్గిపోతున్న అక్షయ్‌ మార్కెట్.. నెక్స్ట్ మూవీపైనే ఆశలు..

| Edited By: Anil kumar poka

Oct 12, 2023 | 12:18 PM

ఒక్కో సినిమాతో తన రికార్డ్‌ తానే బ్రేక్ చేసుకుంటూ వెళుతున్నారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌. అయితే ఈ రికార్డ్‌లు అక్షయ్‌ ఫ్యాన్స్‌ను చాలా బాధపెడుతున్నాయి. అదేంటి రికార్డులు క్రియేట్ అయితే ఫీల్ అవ్వటం ఎందుకు అనుకుంటున్నారా? ఒకప్పుడు బాలీవుడ్‌లో మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ ఇప్పుడు బ్యాడ్ ఫేస్‌లో ఉన్నారు. ఐదేళ్లలో ఒక్క ఓమైగాడ్ 2 తప్ప అక్షయ్‌ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ రేంజ్‌కు రాలేకపోయింది.

1 / 6
ఒక్కో సినిమాతో తన రికార్డ్‌ తానే బ్రేక్ చేసుకుంటూ వెళుతున్నారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌. అయితే ఈ రికార్డ్‌లు అక్షయ్‌ ఫ్యాన్స్‌ను చాలా బాధపెడుతున్నాయి. అదేంటి రికార్డులు క్రియేట్ అయితే ఫీల్ అవ్వటం ఎందుకు అనుకుంటున్నారా? అయితే వాచ్‌ దిస్

2 / 6
ఒకప్పుడు బాలీవుడ్‌లో మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ ఇప్పుడు బ్యాడ్ ఫేస్‌లో ఉన్నారు. ఐదేళ్లలో ఒక్క ఓమైగాడ్ 2 తప్ప అక్షయ్‌ నటించిన ఒక్క సినిమా కూడా హిట్ రేంజ్‌కు రాలేకపోయింది.

3 / 6
ముఖ్యంగా ఒక్కో సినిమాకు అక్షయ్‌ మార్కెట్ తగ్గిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది. లక్ష్మీ, కట్‌పుత్లీ లాంటి సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ కాగా థియేటర్లో రిలీజ్ అయిన సూర్యవంశి, బచ్చన్‌ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్‌, రక్షా బంధన్‌, సెల్ఫీ లాంటి సినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి.

4 / 6
వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీస్‌, ఫుల్ రన్‌లో 20, 30 కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. అక్షయ్‌ కెరీర్‌లోనే లీస్ట్ ఓపెనింగ్స్‌తో మొదలైన సెల్ఫీ మూవీ ఫుల్ రన్‌లోనూ మంచి నెంబర్స్ రికార్డ్ చేయలేకపోయింది. ఒక్క వారంలోనే మ్యాగ్జిమమ్‌ థియేటర్ల నుంచి అవుట్ అయ్యింది సెల్ఫీ.

5 / 6
అంతేకాదు 140 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కిన సెల్ఫీ ఫుల్‌ రన్‌లో 12 కోట్లకు కూడా వసూలు చేయలేకపోయింది. ఆ తరవాత ఓ మై గాడ్‌ 2తో కాస్త పరవాలేదనిపించినా లేటెస్ట్ మూవీతో మరోసారి నిరాశపరిచారు ఖిలాడీ హీరో.

6 / 6
రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన మిషన్‌ రాణీగంజ్‌ తొలి రోజు రెండున్నర కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. ఇప్పటి వరకు అక్షయ్‌ కెరీర్‌లో లీస్ట్ కలెక్షన్స్ సాధించిన సెల్ఫీ కన్నా కూడా మిషన్ రాణీగంజ్‌ కలెక్షన్స్‌ దారుణంగా ఉండటంతో అక్షయ్‌ మార్కెట్‌ మీద మరోసారి అనుమానాలు మొదలయ్యాయి.