
బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ బుల్లి తెరపై నాగీన్ సీరియల్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ తర్వాత తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి నాగినీ సీరియల్‌తో తెలుగు అభిమానుల ఫేవరెట్ నటిగా మారిపోయిది. ఈ అమ్మడు ఈ సీరియల్‌తో బాలీవుడ్ టూ టాలీవుడ్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఈ ఫేమ్‌తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి, చాలా సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి, మెప్పించింది. ముఖ్యంగా అలియా,రణ్ బీర్ కపూర్ , నాగార్జున నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. దీని తర్వాత ఈ బ్యూటీకి వరసగా అవకాశాలు క్యూ కట్టాయి.

దీంతో టాలీవుడ్, బాలీవుడ్‌లో లు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ విశ్వంభర మూవీలో ఈ అమ్మడు ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇలా ఓ వైపు సినిమాలు మరో వైపు స్పెషల్ సాంగ్స్‌లో అలరిస్తూ, తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది ఈ అందాల చిన్నది. రీసెంట్‌గా ఈ బ్యూటీ హారర్ యాక్షన్ కామెడీ చిద్రం ది భూత్నీ తో అభిమానులను పలకరించింది.

ఇక సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌తో బిజీ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం సమయం దొరికినా సరే వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ అడవుల్లో అడ్వైంచర్ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇవి అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.