
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్‌తో సన్నిహితంగా ఉండటం వల్ల పలు సమస్యలను ఎదుర్కొంటోంది.

ప్రస్తుతం ఈ కేసులో జాక్వెలిన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగా పదే పదే ఈడీ ఆఫీసు మెట్లు ఎక్కాల్సి వస్తుందామె.

కాగా ఈ వివాదాల నుంచి దూరంగా కాస్త మనశ్శాంతి కోరుకుంటూ జమ్మూ-కశ్మీర్‌లోని వైష్ణవి దేవి ఆలయానికి వెళ్లింది జాక్వెలిన్.

ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాక్వెలిన్. ప్రస్తుతం ఈ వేకేషన్ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కాగా శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమాలో ఆడిపాడింది. చివరిగా రణ్‌వీర్ సింగ్ సర్కస్ సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతం క్రాక్ అనే సినిమాలో నటిస్తోంది.