
సీరియల్స్ లో నటించి.. ఆతర్వాత సినిమాలు చేసి ఆకట్టుకుంది ఆ చిన్నది. అలాగే ప్లే బ్యాక్ సింగర్ గాను రాణించింది ఆ బ్యూటీ కానీ ఇప్పుడు ఆమెను ఓ ముఠా కిడ్నప్ చేసింది. ఆమె ఎవరో తెలుసా..

మహారాష్ట్రకు చెందిన ఫిరోజా ఖాన్ .. ఈ ముద్దుగుమ్మ హిందీ సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్‌లో నటించారు. అంతే కాదు చాలా సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా కూడా తన ప్రతిభ చాటుకుంది.

ఓవైపు నటిస్తూనే.. సింగర్‌గాను రాణిస్తోంది ఈ అమ్మడు. ముంబైలో నటి ఫిరోజా ఖాన్ కిడ్నాప్‌కు గురైంది. ఈ కిడ్నప్ కు సంబందించిన వార్తలు వైరల్ అయ్యాయి.ఈ వార్త తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ విషయాలు తెలిపింది. నేను కొంతమందిని కలుస్తూ ఉండేదాన్ని.. అయితే వారిని కలవడం డేంజర్ అని చెప్పినా వినలేదు. చివరకు వాళ్లు చెప్పినట్లే జరిగిందని నటి ఫిరోజా ఖాన్ అన్నారు.

ముంబైలోని నలసోబారా స్లమ్ ఏరియా ఏరియాకు వెళ్తే అక్కడ ఓ ముఠా తనను కిడ్నప్ చేసిందని తెలిపింది. ఎత్తుకెళ్ళి తనను చిత్రహింసలకు గురి చేశారని తెలిపింది. కిడ్నాప్ చేసి తనను చిత్రహింసలు పెట్టారని.. ఆ విషయాలను బయట చెప్పుకోలేనని తెలిపింది.