3 / 5
కాగా బిగ్ బాస్ 3 రియాల్టీ షోలో పాల్గొన్న మహేష్ విట్టా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. హౌస్‌లో ఉన్నప్పుడే మహేశ్ తన లవ్ స్టోరీ గురించి రివీల్ చేశాడు. ఐతే ప్రియురాలి వివరాలు మాత్రం వెల్లడించలేదు. సుమారు ఐదేళ్లుగా శ్రావణి రెడ్డిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మరో ట్విస్ట్ ఏంటంటే శ్రావణి స్వయంగా తన చెల్లెలు ఫ్రెండేనట. రెండేళ్ల స్నేహం తర్వాత తన ప్రేమను శ్రావణి అంగీకరించిందని మహేశ్ తన ప్రేమ ముచ్చట్లు చెప్పాడు.